: భారత అంతరిక్ష కీర్తి కిరీటంలో మరో కలికితురాయి... జీశాట్ 18 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం


భారత కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. అంతరిక్ష ప్రయోగాల్లో భారతదేశం మరో విజయం సాధించింది. ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియాన్‌-5 వీఏ-231 రాకెట్‌ ద్వారా జీశాట్ 18 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. భారత కాలమానం ప్రకారం నేటి వేకువజామున 2 గంటలకు అధునాతన కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌-18 ను ప్రయోగించారు. ఆస్ట్రేలియాకు చెందిన స్కై మస్టర్‌-2 ఉపగ్రహంతో కలిసి జీశాట్‌ ను నింగిలోకి పంపారు. వీటిని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో 24 గంటల ఆలస్యంగా జీశాట్-18 ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. ఈ ఉపగ్రహంతో దేశీయ టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థ మరింత బలపడనుంది. ఇప్పటికే దేశీయ టెలికమ్యూనికేషన్ రంగంలో భారత్‌ కు చెందిన 14 సమాచార ఉపగ్రహాలు సేవలందిస్తున్నాయి. తాజాగా ఈ ఉపగ్రహ ప్రయోగంతో మరింత మెరుగైన సేవలు పొందే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News