: హైదరాబాదులో మరో డ్రంకెన్ డ్రైవ్ యాక్సిడెంట్!
హైదరాబాదులో మందుబాబుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా మద్యం తాగడం మానడం లేదు. పంజాగుట్టలో చిన్నారి రమ్య, పెద్ద అంబర్ పేట్ లో చిన్నారి సంజన ఉదంతాలను మరువకముందే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మన్ ఘాట్ గాయత్రినగర్ లో ఓ తాగుబోతు డ్రైవర్ కారును ఓ వ్యక్తి మీదికి ఎక్కించేశాడు. వివరాల్లోకి వెళ్తే...గాయత్రినగర్ లో నివసించే వ్యాపారి సీహెచ్ యాదగిరి (47) రాత్రి ఇంటి సమీపంలోని కూరగాయల మార్కెట్ కు వెళ్లాడు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన టీఎస్ 08 యూబీ 1734 క్యాబ్ యాదగిరిని ఢీ కొట్టింది. దాంతో అతను పడిపోవడంతో అతని రెండు కాళ్లపై నుంచి కారు దూసుకెళ్లింది. దీంతో అతనిని ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స చేసిన వైద్యులు మల్టిఫుల్ ఫ్రాక్చర్స్ గా నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.