: రాష్ట్రీయ రైఫిల్స్ ఆర్మీ క్యాంప్ పై ఉగ్రవాదుల దాడి.. ఎదురుకాల్పులు
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. కశ్మీర్ లోని హంద్వారాలో చొరబడ్డ ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడికి దిగారు. రాష్ట్రీయ రైఫిల్స్ ఆర్మీ క్యాంప్ పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఉగ్రవాదులను వెంబడించగా, లాంగ్ గేట్ దగ్గర వారు ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. దీనికి దీటుగా స్పందిస్తున్న భద్రతా దళాలు వాటిని తిప్పికొడుతున్నాయి. కాగా, గత వారం రోజులుగా భారత్ లో చొరబడేందుకు తీవ్రవాదులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.