: ప్రధాని మోదీని కలిసిన జమ్మూకాశ్మీర్ సీఎం


పీఓకేలో భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా కాశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితి గురించి ప్రధాని ఆరా తీశారు. రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నప్పుడు కాశ్మీర్ కు కేంద్రం అందించిన సాయానికి గాను ఆమె మోదీకి కృతఙ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చేపట్టిన చర్యలను ముఫ్తీ వివరించారు.

  • Loading...

More Telugu News