: 'ఇజం' వేడుకలో తండ్రీకొడుకుల ముచ్చట్లు!
హైదరాబాదులో జరుగుతున్న ‘ఇజమ్’ ఆడియో వేడుక కార్యక్రమంలో తండ్రీకొడుకులు నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు ఆప్యాయంగా ముచ్చటించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి వచ్చేటప్పటికే నందమూరి హరికృష్ణ అక్కడికి చేరుకున్నారు. తన తండ్రి కూర్చుని ఉన్న సోఫా వద్దనే, కిందకు వంగి మరీ కూర్చున్న యంగ్ టైగర్ ఆయనతో సరదాగా ముచ్చట్లాడుతూ కనిపించాడు. కాగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ‘ఇజమ్’ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహించాడు.