: పులి చర్మం రంగుతో అరుదైన సీతాకోకచిలుక
అసలు, సీతాకోక చిలుకలే చూడముచ్చటగా ఉంటాయి.. ఎన్నిసార్లు వాటిని చూసినా, ఆహ్లాదపరుస్తూనే ఉంటాయి. ఇక, పులిచర్మం రంగులో ఉన్న సీతాకోక చిలుక కనపడితే, ఎలా ఉంటుంది!. ఆశ్చర్యపోతూ.. కళ్లప్పగించి చూడాల్సిందే!. ఆ సంఘటన, సంగారెడ్డి రాజంపేటలోని ఒక స్థానికుడి ఇంటి ఆవరణలో జరిగింది. పులి చర్మం రంగులో ఉన్న ఈ సీతాకోక చిలుక రెక్కలపై పులికళ్లను పోలిన కళ్లలా రెండు ఉన్నాయి. దీంతో, ఇంటి యజమాని, కుటుంబసభ్యులు దీనిని చూస్తూ ఆనందించారు.