: పబ్లిసిటీ కోసమే ఆమె మాపై కేసు పెట్టింది: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ
తన తమ్ముడి భార్య పబ్లిసిటీ కోసమే తమపై కేసు పెట్టిందని బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ అన్నాడు. కట్నం కోసం తనను వేధిస్తున్నారంటూ నవాజుద్దీన్ కుటుంబ సభ్యులపై తమ్ముడు మినాజుద్దీన్ భార్య అఫ్రీన్ గత నెల 30న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మధ్యవర్తుల సమక్షంలో ఈ కేసును పరిష్కరించుకోవాలని రెండు వర్గాల వారికి పోలీసులు సూచించడంతో ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ లోని మహిళా పోలీస్ స్టేషన్ కు వారు హాజరయ్యారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన నవాజుద్దీన్ మాట్లాడుతూ, తన తమ్ముడి భార్యను ఎప్పుడూ ఎవరూ వేధించలేదని, ఈ కేసులో తన ప్రమేయం అసలే లేదని చెప్పాడు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు సహా లిఖిత పూర్వక నివేదికను పోలీసులకు అందజేశాడు.