: ఎన్టీఆర్ మండ‌లాల‌ను ఏర్పాటు చేసిన‌ప్పుడు జోకులు వేశారు, సినిమాలు తీశారు: కేటీఆర్


తెలంగాణ‌లో ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాలతో ప్ర‌భుత్వం చేప‌డుతోన్న‌ అభివృద్ధి కార్యక్ర‌మాలు, ప‌థ‌కాలు ప్ర‌తికుటుంబానికి అందుతాయ‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఈరోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తాను సిరిసిల్ల, వేముల‌వాడ‌ల‌ను క‌లిపి రాజ‌న్న జిల్లా చేయాల‌ని క‌మిటీని కోరిన‌ట్లు తెలిపారు. రుద్రంగిని మండ‌లం చేయాల‌ని కోరిన‌ట్లు చెప్పారు. గ‌తంలో దివంగ‌త‌ ఎన్టీఆర్ మండ‌లాల‌ను ఏర్పాటు చేసిన‌ప్పుడు జోకులు వేశారని, సినిమాలు కూడా తీశారని ఆయ‌న అన్నారు. ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చాయ‌ని అన్నారు. కొత్త జిల్లాల వ‌ల్ల కొత్త ఉద్యోగాలు వ‌స్తాయని అన్నారు. హైద‌రాబాద్‌ను జిల్లాలుగా విభ‌జించ‌క‌పోవ‌డానికి కార‌ణం, న‌గ‌రంలో రెవెన్యూ శాఖ‌కు పెద్ద‌గా ప‌ని లేక‌పోవ‌డమేన‌ని కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీని ప్ర‌క్షాళ‌న చేస్తామ‌ని అన్నారు. 24 నుంచి 30 స‌ర్కిళ్లుగా విభ‌జిస్తామ‌ని చెప్పారు. హైద‌రాబాద్‌లో రోడ్ల కాంట్రాక్ట్ వ్య‌వ‌స్థ‌ను మారుస్తామ‌ని చెప్పారు. వైట్ మ్యాపింగ్ రోడ్ల‌ను ఎక్కువ‌గా తీసుకు వ‌స్తామ‌ని పేర్కొన్నారు. నియోజ‌క‌వ‌ర్గాల పునర్వ్యవస్థీకరణ అవ‌స‌ర‌మ‌ని అన్నారు. జీహెచ్ఎంసీ అక్ర‌మ‌క‌ట్ట‌డాల కూల్చివేత ఆగ‌లేదని, స‌ర్వే కొన‌సాగుతోందని చెప్పారు. మ‌ల్లారెడ్డి కాలేజీని కూడా కూల్చ‌డానికి వెళ్లారని, బీఆర్ఎస్ క‌ట్టి ఉండ‌డం వ‌ల్ల ఆగిపోయారని ఆయ‌న చెప్పారు. ఇప్ప‌టికే న‌గ‌రంలో 800పైగా అక్ర‌మ‌కట్ట‌డాలు కూల్చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఈనెల 14న టీహ‌బ్ శాఖ‌ను టీ బ్రిడ్ పేరుతో అమెరికాలో ప్రారంభిస్తున్నామ‌ని చెప్పారు. న‌యీమ్ అరాచ‌కాల‌కు టీఆర్ఎస్ చెక్ పెట్టిందని ఆయ‌న అన్నారు. న‌యీమ్ ఎన్‌కౌంట‌ర్‌తో ఎవ‌రికి హెచ్చ‌రిక‌లు వెళ్లాలో వారికి వెళ్లాయని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News