: అబద్ధాలు ఆడటం పాకిస్తాన్ నైజం: ఆర్మీ మాజీ చీఫ్ జేజే సింగ్
అబద్ధాలు ఆడటం, ఏ విషయాన్ని అంగీకరించకపోవడం పాకిస్థాన్ దేశం నైజమని భారత్ ఆర్మీ మాజీ చీఫ్ జేజే సింగ్ మండిపడ్డారు. ఎల్ఓసీ వద్ద భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ విషయంలో పాకిస్థాన్ చేసే వ్యాఖ్యలను నమ్మవద్దని, మన సైన్యానికి పౌరులందరూ బాసటగా నిలవాలని కోరారు. భారత్ జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ కు సంబంధించిన వీడియోలు బయటపెట్టమని అడిగే అధికారం అందరికీ లేదని, ఇది చాలా సున్నితమైన అంశమని అన్నారు. ఆర్మీ ఒక విషయం చెప్పిన తర్వాత దానిపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని జేజే సింగ్ అన్నారు.