: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
ఈ ఏడాది రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. ఫ్రెంచ్‌కి చెందిన జీన్ పియర్ సావేజ్, బ్రిటీష్ శాస్త్రవేత్త ఫ్రేజర్ స్టొడర్ట్, డచ్‌కు చెందిన బెర్నార్డ్ ఎల్ ఫెరింగా కు నోబెల్ ప్రకటిస్తున్నట్లు స్వీడన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నోబెల్ కమిటీ పేర్కొంది. ప్రపంచ అతి చిన్న మాలిక్యులర్ మిషన్‌లను అభివృద్ధి చేసినందుకు గానూ ఈ ముగ్గురికీ నోబెల్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది.