: ‘ఇలాంటి ప్రశ్నలు అడిగితే చంపేస్తా’ అని యాంకర్ ను అన్న మాట నిజమే: నటుడు సునీల్


‘నేను సీరియస్ అయ్యానంటే.. నన్ను ఇంటర్వ్యూ చేసిన వారు ఫెయిలు అయినట్లే’ అని ప్రముఖ నటుడు సునీల్ అన్నాడు. ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలంటే, సునీల్ నటించిన ‘జక్కన్న’ సినిమా నాటి సంగతులను ప్రస్తావించాల్సిందే. ఈ సినిమా అప్పుడు సునీల్ ఒక న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అప్పుడు యాంకర్ అడిగిన ప్రశ్నలకు సునీల్ ఒక రేంజ్ లో సమాధానం చెప్పాడు. ‘ఇలాంటి ప్రశ్నలు అడిగితే చంపేస్తా’ అని సునీల్ సీరియస్ అవడంతో ఆ యాంకర్ సైలెంట్ అయిపోయాడు. అయితే, ఈ విషయమై సునీల్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు. అది ప్లాన్ ప్రకారం చేసింది కాదని, ఆ ప్రశ్నలకు నిజంగానే సీరియస్ అయ్యానని చెప్పాడు. రెగ్యులర్ ప్రశ్నలు కాదు, కొంచెం గట్టి ప్రశ్నలే అడుగుతానని సదరు యాంకర్ ఆ ఇంటర్వ్యూకు ముందే తనతో చెప్పాడని, ఆ ప్రశ్నల మేరకే తన సమాధానం ఉంటుందని తాను కూడా చెప్పానని సునీల్ పేర్కొన్నాడు. కాగా, ఆ రోజున ఆ యాంకర్ సునీల్ ను అడిగిన ప్రశ్నలేంటంటే..‘నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా?,’ ‘నువ్వు పుట్టిన కులం వల్లే ఇంత పైకి వచ్చావా?’ అంటూ ఆ ఇంటర్వ్యూలో సునీల్ ను ప్రశ్నించడం జరిగింది. అదీ సంగతి!

  • Loading...

More Telugu News