: సరబ్ జిత్ కు పూర్తి స్థాయిలో వైద్య సాయం అందిస్తాం: కేంద్రం


పాకిస్తాన్ జైల్లో సహచర ఖైదీల దాడిలో గాయపడి కోమాలోకెళ్ళిన సరబ్ జిత్ సింగ్ కు అవసరమైన వైద్యం సాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయమై రాష్ట్ర వ్యవహారాల మంత్రి ఆర్పీఎన్ సింగ్ మాట్లాడుతూ, 'సరబ్ జిత్ కు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మేం చేయగలిగిందంతా చేస్తాం. ఇదో బృహత్ ప్రయత్నం' అని తెలిపారు. కాగా, సరబ్ జిత్ ను భారత్ తరలించాలంటూ ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేయడం పట్ల మంత్రి స్పందిస్తూ, దౌత్య మార్గాల్లో ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. అతను కోలుకోవడమే తమ తొలి ప్రాధాన్యత అని కూడా మంత్రి చెప్పారు.

  • Loading...

More Telugu News