: సర్జికల్ దాడుల వీడియోల విడుదలకు మోదీ గ్రీన్ సిగ్నల్!
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి చొచ్చుకెళ్లి జవాన్లు జరిపిన సర్జికల్ దాడులపై మంత్రులు, బీజేపీ నేతలు బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలూ చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ సలహా ఇచ్చారు. ఈ ఉదయం క్యాబినెట్ సమావేశంలో వీడియోల విడుదల అంశం చర్చకు రాగా, ఈ దాడులపై వస్తున్న విమర్శలకు సంబంధిత అధికారులు మాత్రమే సమాధానం చెబుతారని మోదీ అన్నారు. మోదీ వ్యాఖ్యలతో నేడో రేపో దాడులకు చెందిన వీడియోలు బయటకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వీటి విడుదలకు ఆయన స్వయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. వీటిని ప్రభుత్వం తరఫున కాకుండా, సైన్యాధికారులే బహిర్గతం చేస్తారని తెలుస్తోంది.