: బ్రెజిల్ లేని ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఎలా ఉంటుందో, మేము లేని ఈ టోర్నీ కూడా అంతే: పాకిస్థాన్ మండిపాటు
ఈ నెల 7వ తేదీ నుంచి జరగనున్న కబడ్డీ వరల్డ్ కప్ లో పాల్గొనకుండా పాకిస్థాన్ పై వేటు వేయడాన్ని దాయాది దేశం జీర్ణించుకోలేకపోతోంది. వరల్డ్ కప్ నుంచి పాక్ ను నిషేధిస్తూ ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ (ఐకేఎఫ్) తీసుకున్న నిర్ణయంపై మండిపడుతోంది. బ్రెజిల్ లేకుండా ఫుట్ బాల్ వరల్డ్ కప్ జరిగితే ఎలా ఉంటుందో, తమ జట్టు లేకుండా జరిగే కబడ్డీ ప్రపంచకప్ కూడా అదే విధంగా ఉంటుందని పాకిస్థాన్ కబడ్డీ ఫెడరేషన్ సెక్రటరీ రానా మహ్మద్ సర్వార్ అభివర్ణించారు. ఈ టోర్నీకి తామే ఫేవరెట్స్ అని, భారత్ లో జరిగే ఈ మ్యాచ్ లలో భారత్ పై గెలిచి కబడ్డీ ప్రపంచ కప్ కొట్టాలని తాము ఉవ్విళ్లూరుతున్నామని అన్నారు. భద్రతే సమస్య అయితే కనుక పాక్ తో భారత్ ను కూడా టోర్నీ నుంచి నిషేధించాలని డిమాండ్ చేశారు.