: కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా జ‌ర‌గ‌డం లేద‌ు.. వాస్తు ప్రకారం జరుగుతోంది: వీహెచ్


తెలంగాణలో చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో చేప‌ట్టిన‌ కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ‌ శాస్త్రీయంగా జ‌ర‌గ‌డం లేద‌ని ఆయ‌న విమర్శించారు. ఆ ప్ర‌క్రియ‌ను వాస్తు ప్రకారం జరిగేలా చేస్తున్నార‌ని ఆరోపించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కోసమే నూత‌నంగా గద్వాల్, జనగామ, సిరిసిల్ల జిల్లాలకు ప‌చ్చ‌జెండా ఊపార‌ని ఆయ‌న అన్నారు. నిజాం పాలనను త‌ల‌పించేలా కేసీఆర్ పాల‌న ఉంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News