: రైతులకు రుణమాఫీ.. విద్యుత్ ఛార్జీలు సగానికి సగం తగ్గిస్తాం: రాహుల్‌ గాంధీ హామీ


ఉత్తరప్రదేశ్‌లో త్వ‌ర‌లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో త‌మ పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగిస్తోన్న కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ ఈరోజు ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై ప‌లు హామీలు గుప్పించారు. మణిహరణ్‌లో నిర్వ‌హించిన సభలో రాహుల్ ప్ర‌సంగిస్తూ... తాము అధికారంలోకి వ‌స్తే రైతులకు రుణమాఫీ చేస్తాన‌ని హామీ ఇచ్చారు. అంతేగాక‌, విద్యుత్‌ ఛార్జీలు స‌గానికి సగం తగ్గిస్తామ‌ని చెప్పారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని విమ‌ర్శిస్తూ.. ప్రజలకు ఆయ‌న ఇచ్చిన హామీలను నెర‌వేర్చ‌లేక‌పోయార‌ని అన్నారు. కేంద్రం నుంచి రైతులకు రావాల్సిన 1.19లక్షల కోట్ల రూపాయ‌ల రుణాలని పరిశ్రమలకు మ‌ళ్లించారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News