: నా తప్పు క్షమాపణలు చెబితే పోయేది కాదు: ఓంపురి పశ్చాత్తాపం
భారత సైన్యంలో ఎవరు చేరమన్నారు? ఎవరు ఆయుధాలు పట్టుకోమని చెప్పారు? అంటూ సైన్యాన్ని కించపరుస్తూ వ్యాఖ్యానించి, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటుడు ఓంపురి, తన పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చారు. తన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నానని, తప్పు చేశానని, ఈ పాపం క్షమాపణలు చెప్పినంత మాత్రన పోయేది కాదని వేదన చెందారు. తనను శిక్షించాల్సిందేనని చెప్పారు. మీడియాకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఉరీ దాడిలో వీరమరణం పొందిన వారికి తొలుత క్షమాపణలు చెబుతున్నట్టు తెలిపారు. వారు మన్నిస్తే, ఆపై ఇండియాను, ఆర్మీని క్షమించాలని వేడుకుంటానని తెలిపారు. ఆయుధం ధరించడం అంటే ఏంటో తనకు తెలిసేలా సైన్యం చేయాలని, ఉగ్రదాడి జరిగిన చోటకు తనను పంపాలని, తనను క్షమించవద్దని చెప్పారు. సైన్యం తనను శిక్షించాలని తీవ్ర పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు.