: దేశవ్యాప్తంగా కలకలం రేపిన దాద్రి ఘటన నిందితుడు మృతి
దేశవ్యాప్తంగా కలకలం రేపిన దాద్రి ఘటన గుర్తుండే ఉంటుంది. బీఫ్ తిన్నాడన్న కారణంతో మహ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తిని అంత్యంత దారుణంగా కొట్టి చంపిన కేసులో నిందితుడు రాబిన్ అలియాస్ రవి (20) నోయిడాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ కేసులో అరెస్టైన రవి నోయిడా జైలులో ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రవి మృతిచెందాడని వైద్యులు వెల్లడించగా, తమ కుమారుడు వ్యాధితో మృతి చెందలేదని, జైలులో పోలీసులు కొట్టిన దెబ్బలు భరించలేక మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు.