: ముగిసిన కేంద్ర మంత్రివర్గ సమావేశం... జమ్ముకశ్మీర్ పరిస్థితిపై మోదీకి వివరించిన రాజ్‌నాథ్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన దేశరాజధాని ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. అందులో ప్రధానంగా పాకిస్థాన్, ఉగ్రవాదులు కాల్పులకు దిగుతోన్న అంశంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కశ్మీర్‌లో ఆందోళనలు, ఉగ్రదాడుల అంశంపై ప్రస్తుత పరిస్థితిని గురించి మోదీకి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించి చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై కూడా చర్చించారు. మరికాసేపట్లో మంత్రులు తమ భేటీలో చర్చించిన అంశాలపై మీడియాకు వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.