: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రమాదం...చిన్నారి తలకు గాయాలు


హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద వశాత్తు ఎయిర్ పోర్ట్ లోని మెట్లపై నుంచి నవ్య అనే చిన్నారి జారిపడింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది చిన్నారిని ఎయిర్ పోర్ట్ ఆసుపత్రికి తరలించారు. నవ్యను కొత్తపేట అరవిందరావు కుమార్తెగా ఎయిర్ పోర్టు సిబ్బంది గుర్తించారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News