: రెండు నెలల తరువాత తొలిసారి బయటకు రానున్న సోనియా గాంధీ
ఆగస్టు 2న వారణాసిలో జరిగిన రోడ్ షోలో తీవ్ర అస్వస్థతకు గురై తొలుత ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలోను, ఆపై శ్రీ గంగారామ్ ఆసుపత్రిలోను చికిత్స పొంది, అప్పటి నుంచీ ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా, మీడియా ముందుకు రాకుండా విశ్రాంతి తీసుకుంటున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, నేడు తొలిసారిగా ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. భారత పర్యటనలో ఉన్న శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘేతో ఆమె సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ నేత ఆనంద్ శర్మ తదితరులు హాజరు కానున్నారు. రనిల్ తో సమావేశం అనంతరం సోనియా మీడియాతో మాట్లాడతారని తెలుస్తోంది.