: సౌత్ బ్లాక్ కు చేరుకుంటున్న కేంద్ర మంత్రులు...సర్జికల్ స్ట్రయిక్స్ వీడియో, ఫోటోలు విడుదలపై చర్చ


ప్రధాని మోదీ అధ్యక్షతన దేశభద్రతలో భాగంగా సరిహద్దుల్లో పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సమావేశం ప్రారంభమైంది. దీంతో సౌత్ బ్లాక్ కు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, అర్బన్ డెవలెప్ మెంట్ మినిస్టర్ వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, రైల్వే మంత్రి సురేష్ ప్రభు, విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, ప్రకాశ్ జవదేకర్ తదితరులతోపాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ పై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు రేగుతుండడంతో వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు విడుదల చేయాలా? వద్దా? విడుదల చేస్తే కలిగే లాభాలేంటి? విడదల చేయకపోవడం వల్ల కలిగే నష్టాలేంటి? అన్నదానిపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం సర్జికల్ దాడుల ఫోటోలు, వీడియోలు విడుదల చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు.

  • Loading...

More Telugu News