: భారీ విధ్వంసానికి భారీ కుట్ర... కంచె దాటేందుకు 100 మంది ఉగ్రవాదులను సిద్ధం చేసిన పాకిస్థాన్


సర్జికల్ దాడుల తరువాత కూడా బుద్ధి తెచ్చుకోని పాకిస్థాన్, సరిహద్దుల్లో ఓ వైపు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ మరోవైపు ఇండియాలో భారీ ఎత్తున ఉగ్రవాద దాడులు చేయాలని కుట్ర పన్నుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. సరిహద్దులు దాటి దాడులకు తెగబడేందుకు 100 మంది ఉగ్రవాదులను పాక్ సిద్ధంగా ఉంచిందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సరిహద్దుల్లో సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉండాలని తెలిపాయి. తాజా హెచ్చరికల నేపథ్యంలో ఎల్ఓసీ వెంట భద్రతను పెంచామని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ వెల్లడించారు. ఎందరు ఉగ్రవాదులు వచ్చినా వెనకడుగు లేదని, వారిపై విరుచుకుపడి గుణపాఠం చెప్పేందుకు జవాన్లు సిద్ధంగా ఉన్నారని వివరించారు. కాగా, గడచిన 36 గంటల్లో ఆరు సార్లు పాక్ వైపు నుంచి కాల్పులు జరిగాయని, సాధారణ పౌరుల ఆవాసాలు లక్ష్యంగా కూడా పాక్ సైన్యం తెగబడుతోందని, రక్షణ శాఖ మానవ సంబంధాల అధికారి మానిష్‌ మెహతా పేర్కొన్నారు. మోర్టారు బాంబులు, ఆటోమేటిక్‌ ఆయుధాలతో పాక్ సైన్యం కాల్పులు సాగిస్తుండగా, వాటిని మన సైనికులు విజయవంతంగా అడ్డుకున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News