: పాక్ పై దాడుల వీడియోలు రెడీ... విడుదల చేసేందుకు ఆర్మీ ఓకే


సరిహద్దులు దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి చొచ్చుకెళ్లి పదుల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టి వచ్చిన భారత సైన్యం, అందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ సిద్ధంగా ఉందని, దాన్ని విడుదల చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని తేల్చి చెప్పింది. వీటిని ఎప్పుడు రిలీజ్ చేయాలన్న విషయంలో తుది నిర్ణయం ప్రధానిదేనని ఉన్నాతాధికారి ఒకరు తెలిపారు. అసలు సర్జికల్ దాడులు జరిగాయా? అన్న అనుమానాలు అంతర్జాతీయ స్థాయిలో తలెత్తుతుండటం, విపక్షాలు సైతం విమర్శిస్తుండటం, మరోవైపు పాకిస్థాన్ అసలు దాడులే జరగలేదని పదే పదే చెబుతుండటంతో ఈ వీడియోలు బయటకు విడుదల చేయడమే మేలని సైన్యాధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఇండియాలో సైనికులు చేపట్టే కార్యక్రమాలపై వారు చెబితేనే తప్ప, ఎన్నడూ సాక్ష్యాలు బయట పెట్టలేదు. తాజాగా ఇండియాలో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడుల నేపథ్యంలో జరిగిన సర్జికల్ దాడుల వీడియోలను విడుదల చేస్తే ప్రశ్నించే వాళ్లను, పాక్ నోరునూ మూయించవచ్చని ప్రభుత్వం సైతం భావిస్తోంది. కాగా, సైన్యం నిర్వహించిన ఆపరేషన్ ను డ్రోన్ కెమెరాలతో చిత్రిస్తుండగా, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ఆర్మీ అధికారులు రాత్రంతా మేల్కొని చూశారని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్‌సింగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News