: మా ఆయనకు ఐసీస్ తో సంబంధాలున్నాయా?.. నాకు తెలియదే!: అరెస్టయిన కేరళ ఉగ్రవాది భార్య


తన భర్తకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని తనకు తెలియదని కేరళలో అరెస్టైన ఆరుగురు ఐసిస్‌ సానుభూతిపరుల్లో ఒకడైన సువాలిక్‌ మహమ్మద్‌ (26) భార్య జిమ్ సిన్న (24) తెలిపారు. కేరళలోని కన్నూర్‌ కనకమలై ప్రాంతంలో ఐసీస్‌ ఉగ్రవాద సంస్థతో లింకులున్నాయన్న అనుమానంతో ఎన్ఐఏ అధికారులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిలో త్రిచూర్‌ జిల్లా వెంగానల్లూరుకు చెందిన సువాలిక్‌ మహమ్మద్‌ కు ఆరేళ్లుగా ఐసీస్ తో సంబంధాలు ఉన్నట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అతని కుటుంబం కూడా కేరళలో కాకుండా చెన్నైలోని కొట్టివాక్కం అన్నై సత్యానగర్‌ లో నివాసం ఉంటున్నట్టు గుర్తించారు. గుణశేఖర్‌ అనే వ్యక్తి ఇంట్లో నెలకు 7 వేల రూపాయలు చెల్లిస్తూ భార్యతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. కేరళలోని కొలికోడుకు చెందిన జిమ్ సిన్నను సువాలిక్‌ మహమ్మద్‌ నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. దీంతో అక్కడికి వెళ్లి తనిఖీలు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు అతని భార్యను 4 గంటలపాటు విచారించారు. ఈ సందర్భంగా తన భర్తకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న విషయం తనకు తెలియదని ఆమె ఎన్ఐఏ అధికారులకు చెప్పింది. పాఠశాల విద్యతోనే సరిపుచ్చిన సువాలిక్ 2010 నుంచి చైన్నైలోని వివిధ కంపెనీల్లో పని చేస్తూనే విధ్వంసానికి కుట్రపన్నాడని విచారణ అధికారులు తెలిపారు. ఐసీస్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఏర్పరచుకొన్న సువాలిక్ కంప్యూటర్‌ విద్యలో ఆరితేరాడని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News