: వరంగల్ లో భారీ అగ్ని ప్రమాదం


వరంగల్‌ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని శివనగర్‌ లోని టీసీఐ ట్రాన్స్‌పోర్టు గోడౌన్స్ నుంచి పొగలు రావడాన్ని స్థానికులు గమనించారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు గోడౌన్, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో గోదాము సిబ్బందితోపాటు, వరంగల్‌, హన్మకొండ, గొర్రెకుంట ఇండస్ట్రియల్‌ ప్రాంతాలకు చెందిన అగ్నిమాపక కేంద్రాల అధికారులు, సిబ్బంది తెల్లవారుజామున 3 గంటల నుంచి మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గోడౌన్ లో మెడికల్‌, సీడ్స్‌, బట్టలు, అటోమొబైల్‌ పరికరాలు ఉన్నాయని సిబ్బంది చెబుతున్నారు. ఈ ప్రమాదంలో సుమారు కోటికి పైగా ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని వారు తెలిపారు. సకాలంలో పొగలను గుర్తించడంతో ఈ గోదాముపై నివాసం ఉంటున్న 5 కుటుంబాలు క్షేమంగా బయటపడ్డాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News