: ఏపీ మంత్రి రియల్ ఎస్టేట్ ఆదాయంపై ఐటీ శాఖ దృష్టి?


ఆంధ్రప్రదేశ్ లోని ఓ మంత్రి ఆదాయంపై ఆదాయపు పన్ను శాఖ దృష్టిసారించినట్టు సమాచారం. ఒక మంత్రికి చెందిన ఆదాయ వివరాలపై కన్నేసిన ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారులు ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా ఐటీ దాడులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఆ మంత్రి అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నట్టు తెలియడంతో, ఆయన జరిపిన లావాదేవీలపై ఐటీ శాఖ నిఘా పెట్టింది. ఈ మేరకు సమాచారం సేకరించిన ఐటీ శాఖ ఉన్నతాధికారులు దాడులు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈనెల 15న ఢిల్లీలో ఐటీ కమిషనర్ల సమావేశం అనంతరం అమరావతిలో ఈ మేరకు దాడులు చేసేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం.

  • Loading...

More Telugu News