: నేడు కేసీఆర్ నివాసంలో బతుకమ్మ వేడుకలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో నేడు బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. గత నెల 30వ తేదీ నుంచి విదేశాల్లో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటున్న టీఆర్ఎస్ ఎంపీ కవిత గత రాత్రి హైదరాబాదుకు చేరుకున్నారు. దీంతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ నివాసంలో బతుకమ్మ వేడుకలు అధికారికంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో కవితతో పాటు, సీఎం సతీమణి శోభ కూడా పాల్గొంటారు. నేటి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఈ వేడుకలు సీఎం నివాసంలో ప్రారంభం కానున్నాయి.