: ఐపీఎల్ రద్దు... ఛాంపియన్స్ ట్రోఫీ కొనసాగింపు?


ఇండియన్ ప్రీమియర్ లీగ్ రద్దు కానుందా? అంటే బీసీసీఐ వర్గాలు అవుననే అంటున్నాయి. బీసీసీఐ మానసపుత్రిక ఐపీఎల్. భారత్ లో ఐపీఎల్ ఆరంభం తరువాత బీపీఎల్ (బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్), ఐటీపీఎల్ (ఇండియన్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్), ప్రొ కబడ్డీ లీగ్, ఐఎస్ఎల్ (ఫుట్ బాల్ ఛాంపియన్స్ లీగ్) ఇలా ఎన్నో లీగులు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటన్నింటికీ ఆది గురువు ఐపీఎల్. అలాంటి ఐపీఎల్ ను బీసీసీఐ రద్దు చేసుకోనున్నట్టు తెలుస్తోంది. లోథా కమిటీ సిఫారసుల నేపథ్యంలో ప్రతి టోర్నీకి మధ్య 15 రోజుల వ్యవధి ఉండాలి. అలా లేకపోవడంతో రెండు టోర్నీల్లో ఏదో ఒకదానిలో టీమిండియా పాల్గొనాల్సి ఉంది. ఐతే ఛాంపియన్స్ లీగ్ కూడా బీసీసీఐ రూపకల్పన చేసినదే కావడం విశేషం. ఈ నేపధ్యంలో ఐసీసీ నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీని రద్దు చేస్తే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తో వివాదం ఏర్పడుతుంది. ఇప్పటికే ఐసీసీతో బీసీసీఐకి చిన్నచిన్న విభేదాలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ కు విడుదల చేసిన నిధుల విషయంలో ఈ విభేదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీతో వివాదం కంటే దేశీ టోర్నీ అయిన ఐపీఎల్ ను రద్దు చేయడమే సరైన నిర్ణయమని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే లోథా కమిటీతో బీసీసీఐ కోల్డ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ అసాధ్యంగా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News