: కేకే నివాసంలో కొత్త జిల్లాలపై సమావేశమైన ఉన్నతస్థాయి కమిటీ
తెలంగాణలోని ప్రత్యేక జిల్లాలపై వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ హైదరాబాదు, బంజారాహిల్స్ లోని ఎంపీ కె.కేశవరావు (కేకే) నివాసంలో నిన్న పొద్దుపోయిన తరువాత సమావేశమైంది. ముసాయిదా నోటిఫికేషన్ లో ప్రకటించిన 17 జిల్లాలు కాకుండా మరో నాలుగు ప్రాంతాల నుంచి జిల్లా ఏర్పాటు డిమాండ్లు వెల్లువెత్తడంతో... ఆయా జిల్లాల డిమాండ్లను కూడా పరిశీలించేందుకు కమిటీ సమావేశమైంది. ఈ ఉన్నత స్థాయి కమిటీలో ఎంపీ కె.కేశవరావు నేతృత్వంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు జగదీష్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, జోగు రామన్నలను సీఎం కేసీఆర్ సభ్యులుగా నియమించిన సంగతి తెలిసిందే. ఏఏ మండలాలతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తోంది.