: హైదరాబాదులోని కాలాపత్తర్ లో దారుణం...బైక్ కు అడ్డం వచ్చిన చిన్నారిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన బాలుడు


హైదరాబాదు పాతబస్తీలోని కాలాపత్తర్ లో దారుణం చోటుచేసుకుంది. తన బైక్ కు అడ్డం వచ్చాడన్న కోపంతో మహమ్మద్ అలీషేర్ (2) అనే బాలుడిపై మహ్మద్ ఫైసల్ ఖాన్ పెట్రోల్ పోశాడు. మీద పెట్రోల్ పడడంతో ఏమీ తెలియని ఆ చిన్నారి నవ్వడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఫైసల్ ఖాన్ వెంటనే నిప్పంటించాడు. దీంతో అలీ షేర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీనిని చూసిన బంధువులు సత్వరమే స్పందించి, అలీషేర్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News