: హైదరాబాదు జోన్ ను ఎత్తేసిన టీఎస్ ఆర్టీసీ


తెలంగాణలోని కొత్త జిల్లాల విభజన నేపథ్యంలో హైదరాబాద్ ఆర్టీసీ జోన్ ను ఎత్తివేస్తూ టీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు హైదరాబాదు జోన్ పరిధిలో విధులు నిర్వర్తించిన వివిధ జిల్లాల ఆర్‌ఎంలు ఇకపై టీఎస్‌ ఆర్టీసీ ఎండీ పర్యవేక్షణలో పనిచేయనున్నారు. గ్రేటర్ హైదరాబాదు, హైదరాబాదు, కరీంనగర్ జోన్లు ఉండేవి. తాజాగా గ్రేటర్ హైదరాబాదు జోన్ ను మాత్రమే ఉంచుతూ మిగిలిన రెండు జోన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాల విభజనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News