: డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ బాలీవుడ్ సీనియర్ నటుడి కుమారుడు


ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు అలోక్‌ నాథ్‌ కుమారుడు శివాంగ్ నాథ్ డ్రంకెన్ డ్రైవ్‌ కేసులో పట్టుపడ్డాడు. ఓ స్నేహితుడి పుట్టిన రోజు పార్టీకి వెళ్లి, తిరిగి వస్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఆపడంతో మరింత వేగంగా నడిపే ప్రయత్నం చేశాడు. దీంతో ముంబైలోని శాంతాక్రజ్‌ పోలీసులు వెంబడించి పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. శివాంగ్‌ వద్ద కనీసం డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా లేకపోవడం విశేషం. దీనికి తోడు అతడి వెంట వున్న మహిళా స్నేహితులు పోలీసులతో వాగ్వాదానికి దిగి, తామే వాహనాన్ని నడిపామని దబాయించారని పోలీసులు పేర్కొంటున్నారు. దీంతో శివాంగ్ పై బాంద్రా ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌ కేసు, పోలీసులతో నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు మరో కేసు నమోదు చేశారు. అనంతరం వాహనాన్ని సీజ్‌ చేసి, 2,600 రూపాయల జరిమానా విధించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News