: ఇండియన్ ఆర్మీ డిజిఎంఓ స్వయంగా ప్రకటన చేసినా నమ్మవా?: కేజ్రీవాల్ ను నిలదీసిన అన్నా హజారే
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే నిలదీశారు. సర్జికల్ స్ట్రైక్స్ చేసిన మోదీకి ధన్యవాదాలు తెలిపిన కేజ్రీవాల్... అందుకు సాక్ష్యాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అన్నా హజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియన్ ఆర్మీ డిజిఎంఓ స్వయంగా ప్రకటన చేసినా నమ్మవా? అని ఆయన కేజ్రీవాల్ ను నిలదీశారు. అంతే కాకుండా ఇండియన్ ఆర్మీని కేజ్రీవాల్ నమ్మకపోవడం ఆశ్చర్యం కలిగించిందని ఆయన చెప్పారు. గతంలో సైన్యంలో పనిచేసిన హజారే దేశం కోసం ఏ క్షణమైనా యుద్ధరంగంలో కాలుపెట్టడానికి సిద్ధమని ప్రకటించారు. సర్జికల్ స్ట్రైక్స్ పై ఇండియన్ ఆర్మీని హజారే అభినందించారు. భారతసైన్యం పరాక్రమం ప్రపంచానికి తెలిసేలా చేశారని ఆయన సైన్యాన్ని అభినందిచారు.