: పాకిస్థాన్ నెంబర్ వన్ స్థానానికి ఎగబాకడమే చిత్రం: గంగూలీ


పాకిస్థాన్ జట్టు టెస్టుల్లో వరల్డ్ నెంబర్ వన్ స్థానం సాధించడం పట్ల టీమిండియా దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెస్ట్ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడైన గంగూలీ, క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ జట్టు కంటే టీమిండియా చాలా ఉత్తమమైనదని పేర్కొన్నారు. ఈ రెండు జట్ల మధ్య పోలికకు అవకాశమే లేదని పేర్కొన్నారు. టెస్ట్ క్రికెట్‌ లో కోహ్లీ సేన పాక్ కంటే చాలా ముందుందని అభిప్రాయపడ్డ దాదా, అసలు పాకిస్థాన్ నెంబర్ వన్ ర్యాంక్‌ కు చేరుకోవడమే ఆశ్చర్యానికి గురి చేసే అంశమని పేర్కొన్నారు. టీమిండియా టాప్ ర్యాంక్ కు చేరుకోవడం గురించి తాను ఆలోచించలేదని ఆయన చెప్పారు. రెండో టెస్ట్‌ లో భారత్ గెలవడం తనలాంటి వారికి చాలా ఆనందం కలిగించిందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News