: పాకిస్థాన్ బస్సులో దుండగుల కాల్పులు.. నలుగురు మహిళలు దుర్మరణం


బస్సులోకి దుండగులు ప్రవేశించి, విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో నలుగురు మహిళలు దుర్మరణం చెందిన సంఘటన పాకిస్థాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో జరిగింది. పుద్గలి చౌక్ ప్రాంతంలోని కిరాని రోడ్ లోకి ఇద్దరు దుండగులు మోటార్ సైకిల్ పై వచ్చారు. అక్కడ ఆ వాహనాన్ని వదిలివేసి బస్సులోకి ప్రవేశించిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో నలుగురు మహిళలు చనిపోగా, మరొకరు గాయపడ్డారు. ఆ సమయంలో బస్సులో ఎనిమిది మంది మహిళా ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News