: కేసీఆర్ కు ధన్యవాదాలు: డీకే ఆరుణ


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ మంత్రి డీకే అరుణ ధన్యవాదాలు తెలిపారు. గద్వాలను జిల్లాగా చేయడానికి ఆమోదించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. గద్వాల జిల్లా ఏర్పాటు చేస్తే పార్టీ మారుతానంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని ఆమె ఖండించారు. పార్టీ మారేదానినైతే ఎప్పుడో మారి వుండేదానినని ఆమె స్పష్టం చేశారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదు, రాలేదు, రాదు అని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, గద్వాల జిల్లా కోసం ఆమె రెండు రోజుల దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News