: బాత్రూం అనుకుని లిఫ్టు డోర్ తీసి కిందపడ్డ మహిళ


హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో ప్రమాదం సంభవించింది. గాంధీ ఆసుపత్రిలో ఉన్న బంధువును చూసేందుకు మెదక్ జిల్లాకు చెందిన పోచమ్మ వచ్చింది. ఆసుపత్రిలో బంధువును పరామర్శించి, అక్కడే ఉన్న బాత్రూంకు వెళ్లేందుకు బయటకు వెళ్లింది. ఆసుపత్రిలో ఎక్కడ ఏముందో తెలియని పోచమ్మ బాత్రూం తలుపు అనుకుని లిఫ్టు తలుపుతీసింది. అడుగు వేయగానే లిఫ్ట్ గోతిలోకి పడింది. దీంతో ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయి. పని చేయని లిఫ్టు కావడంతో పెను ప్రమాదం సంభవించలేదని, లేకుంటే మరింత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.

  • Loading...

More Telugu News