: కాశ్మీర్లో లోయలో సంపూర్ణ బంద్
అఫ్జల్ ఉరి తర్వాత కాశ్మీర్ లోయలో విధించిన కర్ఫ్యూ మూడో రోజూ కొనసాగుతోంది. పది జిల్లాలు భారీ పోలీసు బలగాలతో నిశ్శబ్ద వాతావరణాన్ని తలపిస్తున్నాయి. బారాముల్లా జిల్లాలో రెండు రోజుల క్రితం పోలీసు కాల్పుల్లో గాయపడ్డ చిన్నారి కన్నుమూసింది. జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నేత మక్బూల్ భట్ వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో సున్నిత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కర్ఫ్యూను ఎత్తివేయకుండా కొనసాగిస్తున్నారు. అదనపు బలగాలను కూడా రంగంలోకి దింపారు.
మరోవైపు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ నిషేధాజ్ఞలతో అక్కడ వార్తాపత్రికల ప్రచురణ నిలిచిపోయిందంటూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ కట్జూ కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్ళారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ రాశారు.
మరోవైపు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ నిషేధాజ్ఞలతో అక్కడ వార్తాపత్రికల ప్రచురణ నిలిచిపోయిందంటూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ కట్జూ కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్ళారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ రాశారు.