: మలేషియాలో పాఠశాలలో కూలిపోయిన ఆర్మీ యుద్ధ విమానం.. ఏడుగురు విద్యార్థులు సహా 22 మందికి గాయాలు
మలేషియాలోని సభా రాష్ట్రం తవు గ్రామంలోని ఓ పాఠశాలలో ఈరోజు మిలటరీకి చెందిన యుద్ధ విమానం కూలిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఈ విమానం కౌలాలంపూర్ ఆర్మీకి చెందిన శిక్షణ విమానంగా అధికారులు తెలిపారు. ఆ గ్రామం గుండా వెళుతోన్న సమయంలో ఆ గ్రామంలో చాలా తక్కువ ఎత్తున ప్రయాణిస్తూ ఒక్కసారిగా పాఠశాల క్యాంటీన్ పైకప్పును తాకింది. అనంతరం పాఠశాలలో పడిపోయింది. దీంతో ఏడుగురు విద్యార్థులు సహా 22 మందికి గాయాలయ్యాయి. గాయాలపాలయిన వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికిగల కారణాల గురించి తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు.