: ప్రమాదానికి గురైన ‘చిన్నారి సంజన’ తాతయ్యకు గుండెపోటు


హైద‌రాబాద్‌లోని పెద్ద అంబ‌ర్ పేట‌లో నిన్న తాగుబోతులు డ్రైవింగ్ చేయ‌డంతో తల్లీకూతుళ్లు శ్రీ‌దేవీ, సంజ‌నకు తీవ్ర‌గాయాల‌యిన విష‌యం తెలిసిందే. గ‌తంలో తాగుబోతు మైనర్ బాలురు కారు డ్రైవింగ్ చేయ‌డంతో హైదరాబాద్‌లోని పంజాగుట్ట‌లో ర‌మ్య అనే చిన్నారితో పాటు ఆమె కుటుంబంలోని ఇరువురు వ్య‌క్తులు బ‌లైన ఘ‌ట‌న‌లాగే మ‌ళ్లీ ఇటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌డం హైద‌రాబాద్‌లో అల‌జ‌డి రేగింది. అయితే, చిన్నారి సంజ‌న తాత‌య్య న‌రేంద‌ర్‌కు ఈరోజు గుండెపోటు వ‌చ్చింది. త‌న‌ కుమార్తె శ్రీ‌దేవీ, మనవరాలు సంజన గాయపడడంతో మనస్తాపానికి గురయిన నరేందర్‌కు ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని బంధువులు చెబుతున్నారు. ఆయ‌న‌ను వెంట‌నే కామినేని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News