: భారత రాజకీయ నేతలు ఉగ్రవాదుల భాషలో మాట్లాడుతున్నారు: ఆర్మీ మాజీ చీఫ్ మండిపాటు


నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం నిర్దేశిత దాడులు (సర్జికల్ స్ట్రైక్స్) కు పాల్పడటం అంతా అబద్ధమంటూ మన రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆర్మీ మాజీ చీఫ్ శంకర్ రాయ్ చౌదరి మండిపడ్డారు. భారత రాజకీయ నేతలు ఉగ్రవాదుల భాషలో మాట్లాడుతున్నారని, పాకిస్థాన్ మీడియాలో కథనాలను ఆధారంగా చేసుకుని ఇక్కడ రాజకీయాలకు పాల్పడటం తగదని ఆయన హితవు పలికారు. రాజకీయ నేతల వ్యాఖ్యల ద్వారా భారత సైన్యం మనోస్థైర్యం దెబ్బతీయవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News