: హైదరాబాదును జిల్లాను విడగొట్టొద్దు: నాయిని
హైదరాబాదు జిల్లాను విడగొట్టవద్దని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన కొత్త జిల్లాలపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీకి నివేదిక సమర్పించారు. ముఖానికి ముక్కు ఎంత ముఖ్యమో తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు కూడా అంతే ముఖ్యమని ఆయన చెప్పారు. అలాంటి హైదరాబాదును జిల్లాల పేరుతో విడగొట్టవద్దని ఆయన సూచించారు. తన గ్రామం నల్గొండ జిల్లాలోని నేరడిగొమ్మును మండల కేంద్రం చేయాలని కోరితే సీఎం కేసీఆర్ అంగీకరించారని ఆయన చెప్పారు. దేవరకొండను జిల్లా చేస్తే బాగుంటుందని నాయిని అన్నారు.