: బెజవాడ కనకదుర్గమ్మవారి దేవాలయంలో అపచారం


బెజవాడ కనకదుర్గమ్మవారి దేవాలయంలో ఎంతో పవిత్రంగా కొనసాగుతున్న విజయదశమి వేడుకల్లో ఈరోజు అపచారం చోటుచేసుకుంది. ప్రతిరోజులాగే దుర్గాదేవికి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు నివేదన సమర్పించే సమయంలో వీఐపీ భక్తులు గర్భాలయంలో కనిపించడంతో వారు బయటకు వచ్చే వరకు అధికారులు కనకదుర్గకు నివేదనను ఆపేశారు. సాధారణంగా ఆ సమయంలో ఆలయంలోకి ఎవ్వరినీ అనుమతించరు. నివేదన మధ్యలో ఆపేయడం పట్ల పండితులు మండిపడ్డారు. ఈ చర్య మంచిది కాదని అన్నారు. అంతేగాక, గర్భాలయాన్ని శుద్ధి చేయకుండానే నివేదన సమర్పించారని, అపచారం చేశారని వారు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News