: మియాందాద్! యుద్ధం గురించెందుకు కానీ, ఈ చిన్న పని చెయ్ చాలు!: అనురాగ్ ఠాకూర్


యుద్ధానికి రమ్మంటూ సవాలు విసురుతున్న పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ జావేద్ మియాందాద్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పాపం జావెద్ మియాందాద్ ఇంకా ఆ నాటి ఓటముల నుంచి కోలుకున్నట్టు లేదన్నారు. యుద్ధ రంగంలో అయినా, క్రికెట్ మైదానంలో అయినా భారత్ దే గెలుపని చాలాసార్లు రుజువైందని ఆయన గుర్తుచేశారు. ఇంకా గుర్తు రాకపోతే ఓసారి చరిత్రను తిరగేయాలని ఆయన సూచించారు. యుద్ధానికి సిద్ధమైతే పాకిస్తాన్ కు చావుదెబ్బ తప్పదని ఆయన సూచించారు. ఒకవేళ మియాందాద్ కు అతని దేశంపై నమ్మకం ఉంటే, అతని బంధువైన దావూద్ ఇబ్రహీంను భారత్ కు వెళ్లి చూడమని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దావూద్ కే కాదు మియాందాద్ కు కూడా భారత్ అంటే భయమేనని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటివరకూ పాకిస్తాన్ పై భారత్ దే పైచేయి అని, భవిష్యత్తులో కూడా అదే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News