: నుదిటిపై రాసివుంటే ఈ ట్వీట్స్ తరువాత కూడా పాకిస్థాన్ వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు: అద్నాన్ సమీ


పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రయిక్స్ కు భారత సైన్యం దిగిన అనంతరం ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలతో భారతీయులకు అభిమానపాత్రుడైన బాలీవుడ్ ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ మరోసారి తనదైన శైలిలో ట్వీట్స్ చేసి ఆకట్టుకున్నాడు. సర్జికల్ స్ట్రయిక్స్‌ నిర్వహించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ధన్యవాదాలు చెప్పాలని డిమాండ్ చేశాడు. ఉగ్రవాదులు ఎప్పటికైనా ముప్పేనని పేర్కొన్నాడు. తనపై సోషల్ మీడియాలో పాకిస్థానీ సోదరులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారని వాపోయాడు. అయినా సరే తాను అల్లాకు తప్ప మరెవరికీ భయపడనని తెలిపాడు. ఇలా వ్యాఖ్యానించిన తరువాత కూడా తన నుదుటిపై రాసి ఉంటే పాకిస్థాన్ వెళ్లాల్సి రావచ్చని, అయినా సరే పాకిస్థాన్ వెళ్లేందుకు తాను భయపడనని అన్నాడు.

  • Loading...

More Telugu News