: తమిళనాడుకి ఈ నెల 1 నుంచే కావేరీ జలాలు విడుదల చేస్తున్నాం: కర్ణాటక
తమిళనాడుకి కావేరీ నదీ జలాలను విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కకు పెట్టిన కర్ణాటక ప్రభుత్వంపై న్యాయస్థానం నిన్న మరోసారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం నీళ్లు విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టుకి కొద్దిసేపటి క్రితం తెలిపింది. తమిళనాడుకి కావేరీ నీటిని ఈ నెల 1 నుంచే విడుదల చేస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం. సుప్రీం సూచించిన ఆదేశాల మేరకు ఈ నెల 6 వరకు రోజుకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపింది.