: నోటికి టేప్ వేశారు, చేతులు కట్టేశారు... రేప్ చేస్తారని భయపడ్డా: పోలీసులతో కిమ్ కర్దాషియన్


పారిస్ లో తనకు ఎదురైన భయానక అనుభవాన్ని రియాలిటీ టీవీ నటి కిమ్ కర్దాషియన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తుపాకులతో వచ్చిన దుండగులు తనకు గురిపెట్టి బలవంతంగా లాక్కు వెళ్లి బాత్ రూములో బంధించారని తెలిపింది. ఆ సమయంలో వారు తనపై లైంగిక దాడి చేస్తారని హడలిపోయానని, తనకు పిల్లలు వున్నారని, చంపవద్దని వేడుకున్నానని, కావాల్సిన వస్తువులు పట్టుకెళ్లి తనను వదిలేయాలని దీనంగా అడిగానని వెల్లడించింది. ఆ దుండగులు ఫ్రెంచ్ భాషలో మాట్లాడుకున్నారని, ఇటీవల తన భర్త బహుమతిగా ఇచ్చిన ఉంగరాన్ని ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తే, తాను బిగ్గరగా ఏడ్చానని, దీంతో తన నోటికి ప్లాస్టర్ వేశారని తెలిపింది. ఆరు నిమిషాల్లో తాము వచ్చిన పని ముగించుకుని నగలు, నగదు, సెల్ ఫోన్లు తీసుకుని పారిపోయారని పేర్కొంది. ఆపై తాను కట్లు విడిపించుకుని కేకలు వేయడంతో తన బాడీగార్డ్ వచ్చాడని, దొంగలు తనను ఏమీ చేయలేదని ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో కిమ్ కు చెందిన రూ. 45 కోట్ల విలువైన నగలను దుండగులు అపహరించుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News