: వెస్టిండీస్ బోర్డుపై నిప్పులు చెరిగిన డ్వెన్ బ్రావో


వెస్టిండీస్ బోర్డుపై ఆల్ రౌండర్ డ్వెన్ బ్రావో నిప్పులు చెరిగాడు. బోర్డుకు నైతిక విలువలు లేకుండా పోయాయని మండిపడ్డాడు. పాకిస్థాన్ తో ఘోరపరాజయం అనంతరం బ్రావో మాట్లాడుతూ, అర్జంటుగా 15 మంది జట్టు సభ్యులను ఎంపిక చేసి, వెళ్లి ఆడేయండని పంపారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. విదేశీ పర్యటన ఉండగా కోచ్ ను అర్థాంతరంగా ఎందుకు తొలగించారని నిలదీశాడు. కనీసం మాటమాత్రమైనా చెప్పరా? అని ప్రశ్నించాడు. నిబంధనలు, విలువలు లేవా? అని అడిగాడు. దీంతో తమ డ్రెస్సింగ్ రూంలో ఎప్పుడూ గంభీరమైన వాతావరణం కనిపించేదని వాపోయాడు. దీనికి కారణం బోర్డేనని స్పష్టం చేశాడు. క్రికెట్ అంటే ప్రాణం కాబట్టి ఎప్పుడు క్రీజులోకి వెళ్లినా వంద శాతం ప్రదర్శన ఇస్తానని తెలిపాడు. బోర్డు ప్రవర్తనే ఆటగాళ్లలో నైరాశ్యాన్ని నింపిదని, దీంతో ఫలితం తల్లకిందులైందని బ్రావో అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News