: జాకీ చాన్ శాంటాక్లాజ్ లాంటి వ్యక్తి: దిశా పటానీ
ప్రముఖ హాలీవుడ్ నటుడు జాకీ చాన్ అంటే ఇష్టపడని వ్యక్తి ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి జాకీ చాన్ గురించి బాలీవుడ్ నటి దిశా పటానీ ఆసక్తికర అంశాలు వెల్లడించింది. జాకీ చాన్ మంచి నటుడు అనే కంటే మంచి వ్యక్తిత్వమున్న వ్యక్తి అని 'కుంగ్ ఫూ యోగా'లో జాకీ చాన్ తో కలిసి నటిస్తున్న దిశా పటానీ చెబుతోంది. సెట్ లో ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాడని తెలిపింది. షూట్ కి వచ్చేటప్పుడు బోలెడు చాక్లెట్లు, కుకీస్ తీసుకువస్తాడని చెప్పింది. జాకీ చాన్ తనకు శాంటా క్లాజ్ లా అనిపిస్తాడని తెలిపింది. ఏం తెచ్చినా సెట్ లో అందరితో కలిసి పంచుకుంటాడని వెల్లడించింది. జాకీ దయా హృదయమున్న వ్యక్తి అని దిశా పటానీ తెలిపింది. ఆయనతో మాట్లాడిన మొదటి సారే ఆయన గొప్ప వ్యక్తిత్వం అర్థ మైందని దిశా పటానీ తెలిపింది.